భద్రతా సిబ్బందిని దాటుకుని ప్రధానికి అత్యంత సమీపానికి దూసుకొచ్చిన వ్యక్తి!
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/PM-ROAD-SHOW-IN-KARNATAKA.jpg)
బెంగళూరు (CLiC2NEWS): ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో రోడ్‌షో నిర్వహిస్తుండగా ఓ యువకుడు భద్రతా వలయాన్ని దాటుకుని, ఒక్కసారిగా ప్రధాని మోడీ దగ్గరకు దూసుకురావడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం హుబ్బళ్లి నుండి జాతీయ యువజనోత్సవాలు జరిగే ప్రదేశం వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రధాని వాహనం పుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓవ్యక్తి సిబ్బందిని దాటుకుని.. ఒక్కసారిగా మోడీకి సమీపంగా వచ్చాడు. ప్రధానికి పూలమాల వేసేందుకు యత్నించాడు. అప్రమత్తమై అతనిని అడ్డుకున్నారు. అనంతరం యథావిధిగా రోడ్‌షో కొనసాగించారు. అయితే, సెక్యూరిటిని దాటుకుని ఓ వ్యక్తి ప్రధానిని సమీపించడం.. ప్రధాని భద్రతా వైఫల్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
I liҝe the helpful іnfo you provіde in your
articles. I wіll bookmark your blog and check again here freգuently.
І’m quite certain I’ll lеarn many neew stuff right here!Best of luck for the next!