పంజాబ్‌లో భద్రతా వైఫల్యం పై ప్రధానమంత్రి అసహనం..
ఛండీగడ్ (CLiC2NEWS): పంజాబ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ప్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని నిర్భంధించడంతో మోడి కాన్వాయ్ 20 నిముషాల పాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. దీంతో మోడీ తన పర్యటన రద్దు చేసుకొని తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. మోడీ అధికారులతో మాట్లాడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు, కనీసం నేను భఠిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి రాగలిగా అని అసహనం వ్యక్తం చేశారు. ఈఘటనపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భద్రతా లోపం తలెత్తిందని ఆరోపించింది.