కాంగ్రెస్ గూటికి బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ మాజి స్పీకర్, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలందించారని.. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పోచారం సూచనలు స్వీకరిస్తామన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తోనేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని, రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. సమస్యలను అధిగమిస్తూ సిఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని, ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.