కొత్తగూడెంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి?
కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనర్ బాలికలే లక్ష్యంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచార గృహాల్లో దాదాపు 15 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఎక్కడెక్కడ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల వివరాలను సోమవారం మధ్యాహ్నం పోలీసు అధికారులు వెల్లడించే అవకాశముంది.