మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంత్రి హత్యకు కుట్రని పోలీసులు భగ్నం చేశారు. హత్యకు కుట్రపన్నిన 8 మంది నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.