ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని హ‌స్తిన‌లోని ఇందిరాగాంధీ ఇంట‌ర్‌నేష‌న‌ల్ విమానాశ్ర‌యంలో అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) అధికారులు సౌదీ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని త‌నిఖీ చేయ‌గా అత‌ని వ‌ద్ద ల‌క్ష 20 వేల సౌదీ రియాల్‌లు ల‌భించాయి. వాటి విలువ ఇండియా క‌రెన్సీలో రూ.24 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. అధికారులు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.