తెలంగాణ లో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (ఏప్రిల్) రెండో వారం నుండి జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో పాలిసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారు.