ఇల్లంత కుంట‌లో ఇంకా కొన‌సాగుతున్న పోలింగ్‌..

హుజూరాబాద్‌లో 7 గంటలకు వరకు 86.33 పోలింగ్‌ శాతం

Huzurabad:

  • ఇల్లంత కుంట‌లో ఇంకా కొన‌సాగుతున్న పోలింగ్‌..

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇల్లంత‌కుంట‌లో ఇంకా పోలింగ్ కొన‌సాగుతోంది. అక్క‌డ పోలింగ్ కేంద్రంలో ఓట‌ర్లు బారులు తీరారు. ఉద‌యం ఇక్క‌డి పోలింగ్ కేంద్రంలోని ఇవిఎంలు మెరాయించ‌డంతో ఒట‌ర్లంత తిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ ముగింపు వేళ వారంతా ఒక్క‌సారిగా వ‌చ్చారు. దీంతో క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవ‌కాశం ఇచ్చారు.


Badvel:

  • బద్వేల్‌లో 7 గంటల వరకు 68.12% పోలింగ్‌

బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకు 68.12 % పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. మొత్తం మీద పోలింగ్‌ ప్రశాతంగా ముగిసిందని అధికారులు వెల్లడించారు.


Huzurabad:

  • హుజూరాబాద్‌లో 7 గంటలకు వరకు 86.33 పోలింగ్‌ శాతం

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్‌లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు వెల్లడించారు.


Huzurabad:

  • రికార్డ్ బ్రేక్‌ దిశగా హుజూరాబాద్‌ పోలింగ్ శాతం

హుజూరాబాద్‌ పోలింగ్ ప్ర‌శాతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అధికారులు కల్పించారు. పోలింగ్‌ ముగిసే సమయానికి 90 శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

2018లో 84.42 శాతం పోలింగ్‌ నమోదు కాగా, గత రికార్డును బ్రేక్‌ చేసే దిశగా పోలింగ్‌ కొనసాగుతోంది.

సాయంత్రం 5 గంటల సమయానికి 76.26 శాతం పోలింగ్‌ నమోదైంది.


Badvel:

  • ముగిసిన బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. నవంబర్‌ 2న ఫలితం వెలువడనుంది.


Huzurabad:

  • ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. నవంబర్ 2న ఫలితం వెలువడనుంది.


Huzurabad:

  • హుజూరాబాద్‌లో 5 గంటల వరకు 76.26% పోలింగ్‌

హుజూరాబాద్‌లో ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ క్ర‌మంలో ఓటింగ్ శాతం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది.


Huzurabad:

  • నగదు సీజ్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు రూ.3.50 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. 306 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.


Badvel:

  • 3 గంటల వరకు బద్వేల్‌లో 44.82 శాతం పోలింగ్‌

బద్వేల్‌లో ఉప ఎన్నిక పోలింగ్ లో చిన్న పాటి ఘర్షణలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.


Huzurabad:

  • 3 గంటల వరకు హుజూరాబాద్‌లో 61.66 పోలింగ్‌ శాతం
    హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 % పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Huzurabad:

  • కిషన్‌రెడ్డి ట్వీట్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ఉన్నతమైన పాలన కోసం మర్ధుడైన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని కిషన్‌రెడ్డి ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు.


Badvel:

  • బ‌ద్వేల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 % పోలింగ్‌

బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 % పోలింగ్‌ నమోదైంది.
ఉదయం 9 గంటల వరకు 10.49 %
ఉదయం 11 గంటల వరకు 20.89 %.
మ‌ధ్య‌హ్నం 1 గంట వ‌ర‌కు 35.47 శాతం పోలింగ్‌న‌మోదైంది.


Huzurabad:

  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 % పోలింగ్

హుజూరాబాద్ ఉపఎన్నిక చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్‌ సజావుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం పోలింగ్ న‌మోదు అయింది. ఓట‌ర్లు తమ ఓటు హక్కును వినియోగించేకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాల‌కు తరలి వస్తున్నారు.


Huzurabad:

  • పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన సిఇఒ శ‌శాంక్ గోయ‌ల్‌

హుజూరాబాద్ ప‌ట్ట‌ణంలో పోలింగ్ స‌ర‌ళిని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శ‌శాంక్ గోయ‌ల్, జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.వి.క‌ర్ణ‌న్ ప‌రిశీలించారు. పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి ఎన్నిక‌ల సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.


Huzurabad:

  • ఓటుహక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్‌

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్‌నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఈ సంద‌ర్భంగా గెల్లు శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

 

  • ఓటు వేయడానికి ముందు తన ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌కు గెల్లు శ్రీ‌నివాస్‌ దండం పెట్టి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు.

 


Badvel:

  • 11 గంట‌ల‌కు బద్వేల్‌లో 20.89 % ఓటింగ్
    బద్వేలు ఉపఎన్నికల్లో ఉదయం 11.00గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదు

Huzurabad:

  • 11 గంట‌ల‌కు హుజురాబాద్‌లో 33.27% పోలింగ్‌
    హుజురాబాద్‌లో పోలింగ్ భారీగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 % ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.

Badvel:

  • పోలింగ్ కేంద్రంలో సొమ్మ‌సిల్లిన మ‌హిళ‌

బ‌ద్వేల్ మండ‌లం సేట‌క‌ట్లాయిప‌ల్లె పోలింగ్ కేంద్రంలో ఓ మ‌హిళ సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది. ఓటు వేసేందుకు వ‌చ్చిన మ‌హిళ చాలా సేప లైన్‌లో నిల‌బ‌డ‌టంతో సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది. ఎన్నిక‌ల సిబ్బంది ఆమెకు స‌ప‌ర్య‌లు చేశారు.


Badvel:

  • బద్వేల్ నియోజకర్గంలో 14.9 % పోలింగ్‌

ఎపిలోని బద్వేల్ నియోజకర్గంలో ఉదయం 10 గంటల వరకు 14.9 % పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.


Huzurabad:

  • ఆత్మ‌గౌర‌వాన్ని గెలిపించుకోవాలి: ఈటల

కొంద‌రు నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కారని ఈటల అన్నారు. క‌మ‌లాపూర్‌లో ఓటుహ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం ఈట‌ల మీడియాతో మాట్లాడారు.. నియోజ‌క వ‌ర్గంలో మ‌ద్యం ఏరులై పారింద‌ని.. రూ. వంద‌ల కోట్లు పంపిణీ చేశార‌ని ఈట‌ల ఆరోపించారు. ప్రేమాభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవన్నారు. సాయంత్రానికల్లా 90 శాతం పోలింగ్ అవుతుందనుకుంటున్నానని ఈటల అన్నారు.


Huzurabad:

  • ఉదయం 9 గంటల వ‌ర‌కు హుజూరాబాద్‌లో 10.50 % పోలింగ్

హుజురాబాద్‌లో భారీ బందోబస్తు మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం 9 గంటల వరకు హుజురాబాద్‌లో 10.50 శాతం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది.


Huzurabad:

  • హుజురాబాద్ చేరుకున్న ఎన్నికల అధికారి డాక్ట‌ర్ శ‌శాంక్ గోయ‌ల్‌

పోలింగ్ స‌ర‌ళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ హుజురాబాద్ చేరుకున్నారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న హుజురాబాద్ లోని 5 మండలాల్లో బై పోలింగ్ జ‌రుగుతున్న తీరును పరిశీలించనున్నారు.


Huzurabad:

  • ఓటేసిన ఈట‌ల‌
    ఓటు హక్కు వినియోగించుకున్న ఈటెల రాజేందర్ దంపతులు..
    కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ బూత్‌లో బిజెపి అభ్య‌ర్థి ఈటెల రాజేందర్, ఆయన సతీమణి జమున ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Badvel:

  • ఓటు హక్కు వినియోగించుకున్న బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ

పోరుమామిళ్ళ రంగసముద్రం పోలింగ్ కేంద్రంలో బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Huzurabad:

  • ప్రశాంతంగా పోలింగ్: కరీంనగర్ కలెక్టర్ కర్ణన్

9 గంటల వరకు 10.5 శాతం పోలింగ్ జరిగిందని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ పేర్కొన్నారు.
6 చోట్ల ఈవీఎంలల్లో సాంకేతిక లోపం తలెత్తింది. వాటిని స‌రిచేసి పోలింగ్ తిరిగి ప్రారంభించాం.
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.


  • హుజూరాబాద్:

ఈ నియోజవర్గం లో మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లు
2,37,036 మంది ఓటర్లు ఉన్నారు.

ఇక్క‌డ బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్‌
టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్
కాంగ్రెస్ అభ్యర్థి గా బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు.

మొత్తం హుజూరాబాద్‌ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు.

2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లల్లో మహిళలు లక్షా 17 వేల 563 మంది, పురుషులు లక్షా 18వేల 720 మంది ఉన్నారు.

20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు.


  • బద్వేల్‌..

ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ నియోజవర్గంలో ప్రధానంగా వైసీపీ, బీజేపీ పోటి నెలకొంది.
బరిలో వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈ నియోజకర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
3000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు.

Leave A Reply

Your email address will not be published.