ప‌వ‌న్ అభిమానుల‌కి పూన‌కాలే.. లాలా భీమ్లా సాంగ్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

ఈ సాంగ్‌లో థ‌మ‌న్ డ్ర‌మ్స్ వాయిస్తుంటే డ్యాన్స‌ర్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతున్నారు. ఈ పాట ఫ్యాన్స్‌కి కూడా పూనకాలు తెప్పిస్తుంది. కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన ఈ పాట సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న‌ట్టు ముందుగా ప్ర‌క‌టించారు.కాని వాయిదా ప‌డే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.