ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇకలేరు
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) ఇకలేరు. శనివారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1943 మే 23న ఎపిలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలో జన్మించారు. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 1966వ సంవత్సరంలో రంగుల రాట్నంసినిమాతో అరంగేట్రం చేసిస చంద్రమోహన్ దాదాపు 932 సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 175 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. రెండు ఫిలింఫేర్, అరు నంది అవార్డులు అందుకున్నారు.