ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు ఇకలేరు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/KRISHNANM-RAJU.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుండి హీరోగా, విలన్‌గాను 180కి పైగా చిత్రాలలో నటించారు. నిర్మాతగా కూడా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 1999లో బిజెపిలో చేరి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుండి ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికాకాయానికి నివాళులర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపి రఘురామ కృష్ణరాజు తదితరులు నివాళులర్పించారు. సోమవారం కృష్ణంరాజు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.