ప్ర‌ముఖ సినీ నేప‌థ్య‌గాయ‌ని వాణీ జ‌య‌రాం క‌న్నుమూత‌

చెన్నై (CLiC2NEWS): ప్ర‌ముఖ సినీ నేప‌థ్య‌గాయ‌ని వాణీ జ‌య‌రాం శ‌నివారం చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ మృతి నుండి తేరుకోని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వాణీ జ‌య‌రాం మృతితో విషాదం అలుముకుంది. ఆమె 14 భాష‌ల్లో సుమారు 8 వేల‌కుపైగా పాట‌లు పాడారు. వాణీ జ‌యరాం త‌మిళ‌నాడులోని వెల్లూరులో జ‌న్మించారు. ఆమె మృతి ప‌ట్ల తెలుగు, అటు త‌మిళ సినీ ప్ర‌ముఖులు విచారం వ్య‌క‌తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కెసిఆర్‌, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.