ఉద్యమ కెరటం, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రజా గాయకుడు గద్దర్ నగరంలోని ఆపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గద్దర్‌కు బైపాస్ సర్జరీ చేయగా.. కోలుకన్నట్లు కనిపించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్‌కల్యాణ్ సహా పలువులు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. అయితే ఆయనకు ఊపిరతిత్తులు, యురినరీ సమస్యలు తలెత్తి, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిసేలోగా తుది శ్వాసవిడిచారు. గద్దర్ అభిమానులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన నివాసం వద్ద భారీగా అభిమానులు తరలివస్తున్నట్లు తెలుస్తోంది.