ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పోస్టులు

ADA: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో 23 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నెల 15 వ తేదీ నుండి వచ్చే నెల 13వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులు అనుసరించి సంబందిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
ప్రాజెక్ట్ అడ్మిన్ ఆఫీసర్ (పిఎఒ) -4
నెలకు వేతనం రూ. 59,276 అందుతుంది.
ప్రాజెక్టు అడ్మిన్ అసిస్టెంట్ (పిపిఎ)- 9
ప్రాజెక్టు టెక్నీకల్ అసిస్టెంట్ (పిటిఎ) -2
ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.35,220 అందుతుంది.
ప్రాజెక్టు సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ (పిఎస్‌ఎఎ) -6
ఈ పోస్టుకు నెలకు వేతనం రూ. 47,496గా ఉంది.
ప్రాజెక్టు సీనయర్ టెక్నికల్ అసిస్టెంట్ (పిఎస్‌టిఎ) – 2
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 50,224 అందుతుంది.
అభ్యర్థుల వయస్సు 2025 జూన్ 13 నాటికి పిపిఎ, పిటిఎకు 35 ఏళ్లు ఉండాలి. పిఎన్‌టిఎ, పిఎన్ ఎఎకు 45 ఏల్లు ఉండాలి. పిఎఒకు 50 ఏళ్లు ఉండాలి.