ఏడాదికి రూ.18 నుండి రూ.27 లక్షల ప్యాకేజితో పోస్టులు
బెంగళూరులోని కెనరా బ్యాంక్ , హ్యూమన్ రిసోర్సెర్ విభాగంలో 60 స్సెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.18లక్షల నుండి రూ.27 లక్షల ప్యాకేజి అందుతుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రతిపదికన భర్తీ చేసేందుకు ప్రధాన కార్యాలయం దరఖాస్తులను కోరుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 24గా నిర్ణయించారు.
అప్లికేషన్ డెవలపర్స్ -7
క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ -2
అనలిస్ట్ -8
డేటా బస్ అడ్మినిస్ట్రేటర్ – 9
డేటా ఇంజినీర్ -2
డేటా మైనింగ్ ఎక్స్ పర్ట్్ -2
డేటా సైంటిస్ట్ -2
ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ -1
ఇటిఎల్ స్పెషలిస్ట్ -2
జిఆర్‌సి అనలిస్ట్ -ఐటి గవర్నెన్స్, ఐటి రిస్క్ అండ్ కంప్లయన్స్-1
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ -8
ప్రైవేట్ క్లౌడ్ అండ్ విఎంవేర్ అడ్మినిస్ట్రేటర్ -1
ఫ్లాట్‌ఫామ్ అడ్మినిస్ట్రేటర్-1
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-6
ఆఫీసర్ -7
సొల్యూషన్ అర్కిటెక్ట్ 1
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు డిగ్రి బిఇ/ బిటెక్, బిసిఎ / ఎంసిఎ/ ఎంఎ, పిజి ఉత్తీర్ణులై ఉండి.. పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు.. ఒబిసిలకు మూడేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://canarabank.com/ వెబ్‌సైట్ చూడగలరు.