గుజరాత్‌లోని సిఎస్ఎంసిఆర్ఐలో పోస్టులు

సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎస్ఎంసిఆర్ఐ)లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 15 పోస్టుల ఉన్నాయి.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)-5
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (పైనాన్స్ అండ్ అకౌంట్స్) -2
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్పోర్ట్స్ అండ్ పర్చేజ్)-2
పైన తెలిపిన మూడు పోస్టులకు అభ్యర్థుల వయస్సు 31.3.2025 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ -1
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 31.3.2025 నాటికి 30ఏళ్లు ఉండాలి.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ -4
అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు ఉండాలి.
- సెక్యూరిటి ఆఫీసర్ -1
అభ్యర్థులు 31.3.2025 నాటికి 35ఏళ్లు మించకూడదు.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ,టెన్+2, పారా మిలిటరీ బలగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుం రూ.500 గా ఉంది. ఎస్‌సి, ఎస్‌టి , పిడబ్ల్యు బిడిలకు ఫీజు లేదు
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష తేదీ, పరీక్ష సిలబస్, పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలకు అభ్యర్థులు www.csmcri.res.in/node/9728వెబ్‌సైట్ చూడగలరు.