అనంత‌పురంలోని డిఎంహెచ్ఒలో పోస్టులు

డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీసు ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న 16 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి . ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస‌ర్, అనంత‌ర‌పురం అనే చిరునామాకు ఈ నెల 10లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.300.. ఎస్‌సి , ఎస్‌టిల‌కు రూ.150గా ఉంది.

పోస్టుల వివ‌రాలు

క్లినిక‌ల్ సైకాల‌జిస్ట్ -1

ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 33,075 జీతం అందుతుంది.

ఆప్టోమెట్రిస్ట్ -1
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు జీతం రూ.29,549 వ‌ర‌కు అందుతుంది.

ఆడియోల‌జిస్ట్ / స్పీచ్ థెర‌పిస్ట్ -1
స్పీచ్ థెర‌పిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 36,465 జీతం అందుతుంది.

ఫార్మ‌సి ఆఫీస‌ర్ -1
ఆఫీస‌ర్ పోస్టుకు రూ. 23,393 నెల‌కు వేత‌నం అందుతుంది.

డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ -4
ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు జీతం రూ.18,450

లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ (గ్రేడ్-4)-8

గార్డెన‌ర్ పోస్టుకు రూ.15వేలు జీతం అందుతుంది.

ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ, డి.ఫార్మ‌సి, బి.ఫార్మ‌సి, ఎంఫిల్ (సోష‌ల్ సైకాల‌జి, మెట్ హెల్త్), ఎంఎ సైకాల‌జి ఉత్తీర్ణులై ఉండాలి. 2025 జ‌న‌వ‌రి 1వ తేదీ నాటికి 42 ఏళ్ల లోపు ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

 

Leave A Reply

Your email address will not be published.