హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పోస్టులు

HSL: విశాఖ‌ప‌ట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో  ఖాళీగా ఉన్న  పోస్టుల‌ను భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.

స‌బ్ మెరైన్‌, సివిల్, టెక్నిక‌ల్‌, హెచ్ ఆర్‌, సెక్కూరిటి, కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్, డిజైన్, లీగ‌ల్ , బిజినెస్ విభాగాల్లో మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఆధారంగా ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్లో కానీ.. విశాఖ‌ప‌ట్నం హిందూస్తాన్ షిప్‌యార్డ్ లో కాని ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఆగ‌స్టు 9.

 

మేనేజ‌ర్ (టెక్నిక‌ల్) -3

ఈ పోస్టుల‌కు 40 సంవ‌త్స‌రాలు లోపు ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన వారికి నెల‌కు రూ. 60 వేల నుండి రూ. 1,80,000 వ‌ర‌కు వేత‌నం అందుతుంది.

 

ప్రాజెక్ట్ సూప‌రింటెండెంట్ (టెక్నిక‌ల్) -2

అభ్య‌ర్థుల‌కు 57ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి రూ. 1,70,000  వేత‌నం అందుతుంది.

 

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (టెక్నిక‌ల్) -14

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (స‌బ్‌మెరైన్) -9

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (సివిల్‌) -3

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (హెచ్ ఆర్‌) -6

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (సెక్కూరిటి) -1

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్) -1

డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్  (డిజైన్) -2

 

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 40 నుండి 45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ. 73వేల వేత‌నం అందుతుంది.

 

సీనియ‌ర్ క‌న్స‌ల్టంట్ (డిజైన్‌)-1

సీనియ‌ర్ క‌న్స‌ల్టంట్ (లీగ‌ల్)-1

సీనియ‌ర్ క‌న్స‌ల్టంట్ (బిజినెస్ అండ్ వెండ‌ర్ డెవ‌ల‌ప్మెంట్‌)-1

 

క‌న్స‌ల్టెంట్ (స‌బ్‌మెరైన్ )-2

క‌న్స‌ల్టెంట్ (ఢిల్లీ ఆఫీస్ )-1

62 ఏళ్ల లోపు ఉన్న వారు సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, క‌న్స‌ల్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌కాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన వారికి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ ల‌కు రూ. 1,20,000.. క‌న్స‌ల్టెంట్‌ల‌కు రూ. ల‌క్ష జీతం అందుతుంది.

 

మెకానిక‌ల్/  ఎల‌క్ట్రిక‌ల్/  ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ కంట్రోల్స్‌/  షిప్ రైట్ అండ్ ఎక్విప్‌మెంట్ బ్రాంచ్ తో ఇంజినీరింగ్ డిగ్రీ 60% ఉత్తీర్ణ‌త సాధించిన వారు డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌)  అర్హులు.

ఆప‌రేష‌న్స్‌/ ఫ్యాబ్రికేష‌న్, క్వాలిటి అస్యూరెన్స్ /  ఆప‌రేష‌న్/  మెయింటెనెన్స్‌/  ప్లాంట్ రిపేర్స్‌/  ఫంక్ష‌న‌ల్ / హ‌ర్బ‌ర్ ట్రెయిల్స్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. నౌకాద‌ళంలో ప‌నిచేసిన మాజి ఉద్యోగుట‌కు ప్రాధ‌న్యమిస్తారు.

మెకానిక‌ల్/  ఎల‌క్ట్రిక‌ల్/  ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ కంట్రోల్స్‌/  షిప్ రైట్ అండ్ ఎక్విప్‌మెంట్ బ్రాంచ్ తో ఇంజినీరింగ్ డిగ్రీ 60% ఉత్తీర్ణ‌త .. స‌బ్‌మెరైన్ ట్రెయినింగ్ స‌ర్టిఫికెట్ ఉన్న‌వారు డిపిఒ (స‌బ్‌మెరైన్ ) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

60% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ, చేసిన వారు హెచ్ ఆర్/  ప‌ర్స‌న‌ల్ స్సెష‌లైజేష‌న్‌తో ఎంబిఎ. లేదా లా పిజి ఉన్న‌వారు డిపిఒ (హెచ్ ఆర్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. హెచ్ ఆర్ /  ప‌ర్స‌న‌ల్ మేనేజ్ మెంట్ /  ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్‌/  ట్రెయినింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ /  అడ్మినిస్టేష‌న్ అండ్ లీగ‌ల్ మేట‌ర్స్ లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. లీగ‌ల్, ఆర్టిఐ అంశాల్లో నైపుణ్యం కంప్యూట‌ర్ , తెలుగు ప‌రిజ్ఞానం ఉన్న‌వారికి ప్రాధాన్య మిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 300గా ఉంది. ఎస్ సి , ఎస్ టిలు , దివ్యాంగుల‌కు, డిపార్ట్మెంట‌ల్ ఉద్యోగుల‌కు ఫీజు లేదు.

Leave A Reply

Your email address will not be published.