NHAI: నేషనల్ హైవేస్ అథారిటి ఆఫ్ ఇండియాలో పోస్టులు..

ఢిల్లీలో ఉన్న నేషనల్ హైవేస్ అథారిటి ఆఫ్ ఇండియాలో (NHAI) ఒప్పంద ప్రాతిపదికన 11 ఇంజినీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సీనియర్ బ్రిడ్జ్/ స‌్ట స్ట్రక్చరల్ ఇంజినీర్, బ్రిడ్జి డిజైన్, జియోటెక్నికల్ , హైడ్రాలజి అండ్ హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్ , సీనియర్ టన్నెల్ ఇంజినీర్, టన్నెల్ ఇంజినీర్, జియాలజిస్ట్ , క్వాంటిటి సర్వేయర్, డ్రాప్ట్స్ మ్యాన్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా (సివిల్), డిగ్రీ (సివిల్), పిజి (జియాలజి/ స్ట్రక్చరల్ / టన్నెల్/ మైనింగ్), పిహెచ్‌డితో పాటు అనుభవం ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ , ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికి జరుగుతుంది. దరఖాస్తులకు చివరితేది ఆగస్టు 30గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://nhai.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.