పౌత్ర పరిష్వంగన సుఖం

ఏవో, ఏవేవో అవాంతరాలు, అవరోధాలు, అడ్డంకులు
అధిక మించలేక సతమతమవుతున్నా చేరే వీలు చిక్కక
హృదయాంతరాలాల్లో ముదురుతున్న అనురాగ ఆరాటం
మాట వినని మనస్సును అసాధ్యం అదుపు చేయడం
మది నిండా ఆ తలపులతో సాగుతున్నది పోరాటం
మమకార సంకెళ్లను తెంచలేక పరాజయం పాలవుతున్నా
లేతప్రాయపు ముద్దుముచ్చటలు మూటకట్టుకొని
ఆనందించాల్సిన సమయం కోల్పోతున్న అధికంగానే
గడిచిపోతున్న కాలంలో ఎదురుచూపులే మిగులుతున్నాయి
కరోనా కట్టిన కత్తుల వంతెన అవరోధాలు అడ్డుతొలిగి
వినీలాకాశంలో విహరిస్తున్నాయి విమానాలు
ఊహించని జాప్యంలో ఒప్పు ఎవరిదో తప్పు ఎవరిదో
అనుకోని అవాంతరాలు, సమాలోచనలు,సంప్రదింపులు…
అప్పుడే కరిగిపోయింది తిరిగిరాని ఎనిమిది మాసాలు కాలం
అడుగిడాలని తడబడుతూ పాదాల కదలికతో
పడిలేస్తున్న పట్టుదలను వీక్షిస్తూ పట్టరాని ఆనందం
అన్నింటిని ఆన్‌లైన్‌లోనే దర్శిస్తూ నిరాశ, నిట్టూర్పులు
నిస్సహాయత, అసహాయత, ఈ అనుభవం పెద్ద శిక్ష
మదిని తొలిచే బాధ, ఆవేధన అర్థమయ్యేది కొందరికీ
మమతానురాగాల ఆరాటానికి లేవు కొలమానాలు
పౌత్ర పరిస్వంగన సౌఖ్యం సాటిరాదు దేనికి
పారవశ్య మదురిమకు మంచి ముహూర్తం ఇంకెప్పుడో
మనస్సు ఆరాటానికి ముగింపు ఎప్పుడో…
(విదేశాల్లో ఉన్న పిల్లల సంతానాన్ని మిస్ అవుతున్న
నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు అంకితం)
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
Gmail: rangaiahkoneti@gmail.com
తప్పక చదవండి:
తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ