Pawan Kalyan-Balakrishna: బాలయ్యకు పవర్‌స్టార్ అభినందనలు
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈమేరకు పవర్ స్టార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
“బాలనటుడిగా.. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా , యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 యేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని యేళ్లు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.“ అని పవన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న తొలి నటుడు
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో…
— Pawan Kalyan (@PawanKalyan) August 25, 2025