‘భారతీయుడు-2’ చిత్రం నుండి తొలి పాట..

హైదరాబాద్ (CLiC2NEWS): శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా తెరకెక్కించిన చిత్రం ‘భారతీయుడు -2’ . ఈ చిత్రం నుండి పవర్‌పుల్ సాంగ్ బుధవారం చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమా నుండి తొలి పాటను విడుదల చేశారు. ఈ పాటక అశోక్ తేజ లిరిక్స్ అందించగా.. అనిరిధ్ సంగీతం సమకూర్చారు. రితేష్, స్రుతిక సముద్రాల ఆలపించారు. ఈ చిత్రం జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ద్ కీలక పాత్రలు పోషించారు.