వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు తెరిచి నీరు విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/prakasham-barrage.jpg)
విజయవాడ (CLiC2NEWS): ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బ్యారేజీ 25 గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భారీ వరదల మూలంగా బ్యారేజీలోకి 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. బ్యారేజీ నుంచి 23,117 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు.