TS: మోడల్‌ స్కూల్ ఉపాధ్యాయుల‌కూ పీఆర్సీ

విద్యాశాఖ జివొ జారీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్ల బోధనాసిబ్బందికి స‌ర్కార్ జీతాలు పెంచింది. 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తూ, నూతన పేస్కేల్‌ను ఖరారుచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శుక్రవారం జిఒ జారీచేశారు. తెలంగాణ రా ష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లో 3 వేల వర కు బోధనాసిబ్బంది ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు

  • మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాళ్లకు రూ.20,680 – 46,960
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.16,150 – 42,590
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.14,860 – 39,540 పేస్కేల్‌ను అమలుచేశారు.

2015 పీఆర్సీలో భాగంగా ప్ర‌భుత్వం వీరివేతనాలను గణనీయంగా పెంచింది. తాజా గా 2020 పీఆర్సీని వర్తింపజేసి, నూతన వేతనాల అమలుకు జీవో జారీచేసింది. వేతనాల పెంపుపై ఉపాధ్యా య ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, పీఎంటీఏ -టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య, శ్రీ నివాస్‌, శేఖర్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కొంతం నగేశ్‌ హర్షం వ్యక్తంచేశారు.

పేస్కేల్‌: పోస్టు 2015 ———- పీఆర్సీ -2020 పీఆర్సీ

  • ప్రిన్సిపాల్‌ రూ.40,270 – 93,780 ———- రూ.58,850 – 1,37,050
    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ రూ.31,460 – 84,970 ———- రూ.45,960 -1,24,150
    ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ రూ. 28,940 -78,910 ———- రూ. 42,300 -1,15,270
Leave A Reply

Your email address will not be published.