వార‌ఫ‌లాలు (ఆగ‌స్టు 1-7)

మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కావలసిన వ్యక్తులతో తగాదాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


వృషభరాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. శుభం కలుగుతుంది.


మిధునరాశి
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం మీ అంచనాలు కొన్ని ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, శుభం కలుగుతుంది.


కర్కాటకరాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం మీ సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలు కొంత సానుకూలమవుతాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఊహించని రీతిలో తీరతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


సింహరాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని పెండింగ్‌ బాకీలు సైతం వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. బంధువర్గం సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతమైన సమాచారం రాగలదు. వ్యాపారవర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


కన్యారాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. భూ, గృహయోగాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, శుభం కలుగుతుంది.


తులారాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో మరింత అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుమణుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, శుభం కలుగుతుంది.


వృశ్చికరాశి
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని విధుల్లో ముందుకు సాగుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో కొద్దిపాటి వివాదాలు. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శుభం కలుగుతుంది.


ధనుస్సురాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కొన్ని పనులను హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. శుభం కలుగుతుంది.


మకరరాశి
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. కోర్టు విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వాహనయోగం. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, శుభం కలుగుతుంది.


కుంభరాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ అనుభవాలతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, మిత్రుల సహకారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో మరింత సానుకూల వాతావరణం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.


మీనరాశి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు బంధువులను మెప్పిస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఇతరులకు సైతం సాయం అందించేందుకు ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు కొంత నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.. శుభం కలుగుతుంది.

-ఎన్‌.రాజ్య‌ల‌క్షి
జ్యోతిష్య‌పండితులు

14 Comments
  1. SEO says

    Wow, amazing weblog layout! How long have you ever been running a blog for? you make running a blog look easy. The full glance of your website is great, as smartly as the content material!!

  2. www.dunkinrunsonyou.com says

    Please let me know if you’re looking for a author for your site. You have some really great articles and I believe I would be a good asset. If you ever want to take some of the load off, I’d really like to write some content for your blog in exchange for a link back to mine. Please send me an email if interested. Cheers!

  3. Walter says

    I feel this is among the most vital information for me. And i am satisfied reading your article. However should commentary on few common things, The web site style is perfect, the articles is really excellent : D. Good process, cheers

  4. click here says

    Superb site you have here but I was curious about if you knew of any discussion boards that cover the same topics discussed here? I’d really love to be a part of online community where I can get responses from other knowledgeable individuals that share the same interest. If you have any suggestions, please let me know. Cheers!

  5. Start watchown tv activate says

    There’s noticeably a bundle to know about this. I assume you made sure nice factors in features also.

  6. Activate.nbcnews.com says

    You carry a valuable creativity. Your marketing proficiencies are simply wonderful. Many thanks for sending content on-line and teaching your users.

  7. click here says

    Does your site have a contact page? I’m having trouble locating it but, I’d like to shoot you an email. I’ve got some ideas for your blog you might be interested in hearing. Either way, great website and I look forward to seeing it expand over time.

  8. Get ink preferred says

    Hmm is anyone else encountering problems with the images on this blog loading? I’m trying to find out if its a problem on my end or if it’s the blog. Any feed-back would be greatly appreciated.

  9. Www jetbluemastercard com says

    Hello there! I could have sworn I’ve been to this blog before but after checking through some of the post I realized it’s new to me. Anyhow, I’m definitely delighted I found it and I’ll be book-marking and checking back often!

  10. With havin so much written content do you ever run into any problems of plagorism or copyright violation? My site has a lot of completely unique content I’ve either created myself or outsourced but it appears a lot of it is popping it up all over the internet without my permission. Do you know any ways to help prevent content from being stolen? I’d certainly appreciate it.

  11. Click here says

    Today, I went to the beach with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is completely off topic but I had to tell someone!

  12. bluebird.com says

    Please let me know if you’re looking for a article author for your blog. You have some really great articles and I think I would be a good asset. If you ever want to take some of the load off, I’d absolutely love to write some content for your blog in exchange for a link back to mine. Please blast me an email if interested. Many thanks!

  13. Paramountnetwork activate says

    I’m not sure exactly why but this web site is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a issue on my end? I’ll check back later and see if the problem still exists.

  14. What’s up to all, how is the whole thing, I think every one is getting more
    from this web site, and your views are fastidious in support of new viewers.

Leave A Reply

Your email address will not be published.