ఎపి ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి అమలు.. ఉత్తర్వులు జారీ
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా పిఆర్సి అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సిపి సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిదే. 11వ పిఆర్సి అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా పిఆర్సి అమలు చేయనుంది. 2020 జనవరి ఒకటవ తేదీ నుండి పిఆర్సి అమలుకానుంది.