పైల్స్ నివారణకు, ఇబ్బందికి పెట్టకుండా ఉండేందుకు తీసుకునే జాగ్రత్తలు

పైల్స్.. (బావాసిర్ )కి ఈ క్రింది విధంగా ఆహారనియమాలు కొన్ని ట్రిక్స్ పాటిస్తే రోగం కొద్దిగా నుండి ఉపశమనం కలుగుతుంది.

  •  మనం తినే ఆహారం గ్యాస్ ని ఉత్పత్తి చేయకుండా మలబద్ధకం రాకుండా వుండే ఆహారపదార్దాలు తీసుకోవాలి
  •  త్వరగా అరుగుదల అయ్యే ఆహారం తీసుకోవాలి. సమయానికి ఆహారం తినాలి.సమయం కానీ సమయం లో ఆహారాన్ని తినరాదు.                     సమయపాలన చేయాలి.
  • మైదా, శనగ పిండి తో చేసిన పిండి పదార్దాలు గ్యాస్ ఉత్పత్తి చేస్తాయి వీటిని పూర్తిగా తినరాదు.డీప్ ఫ్రైడ్ చేసిన food, అసలు తినరాదు.
  •   రోజు నీరు కనీసం 4 లీటర్ కన్న ఎక్కువగా తాగితే మంచిది.
  •  ఆకు కూరలు, కూరగాయలు పీచు వున్న వాటిని సొరకాయ, బీరకాయ, టమాటా, పాలకూర, మెంతికూర, చుక్క కూర, తీసుకోవాలి.
  •  మాలమూత్రం వస్తే వాటిని నిర్భందించకుండా వెంటనే బయటకు విసర్జించాలి.

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొరాదు. కూచున్నపుడు కింద గాలి వచ్చే చైర్స్ మీద కూర్చోవాలి.

 

  •  వెహికల్ ఎక్కువసేపు నడిపేటపుడు కొద్దిగా విరామము ఇవ్వాలి. ఎక్కువగా గుంతలు వున్న చోటు వెహికల్ నడపరాదు. గుంతలు వున్న చోట  నిదానంగా నడపాలి.
  •  ఆకలి అయితేనే ఆహారం తీసుకువాలి. ఆకలి లేకపోతే ఆహారం తినరాదు. ఆహారం కూడా మితంగా తినాలి.
  •  విరుద్ద ఆహారపదార్దాలు తీసుకోరాదు. చేపలు, పాలు, పెరుగు… నెయ్యి – తేనే ఇలాంటివి కొన్ని కలిపి తీసుకోరాదు.
  •  స్నానానికి చన్నీళ్లు వాడరాదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.కొన్ని సమయాల్లో టబ్ బాత్ కూడా చక్కగా ఉంటుంది.
  •  మజ్జిగ, కొబ్బరిబోండా నీరు, చెరుకు రసం, ద్రాక్ష రసం బత్తాయి రసం వీలున్నపుడు తాగాలి. లిక్విడ్ ఎక్కువగా తీసుకోవాలి. (లిక్విడ్ అంటే   ఆల్కహాల్ కాదు సుమా.. నీరు లాంటివి )
  •  రాత్రి త్వరగా నిదురపోవాలి. ఉదయం త్వరగా లేచి నీరు రెండు గ్లాసులు కూర్చోని తాగి మాలమూత్ర విసర్జన చేసుకోవాలి.           వీటిని          కడుక్కోవటానికి  గోరువెచ్చని నీటిని వాడండి అది కూడా చన్నీరు తో కడిగితే చిమ చిమ మంట లేస్తే తప్ప మిగతా టైం లో నీ ఇష్టం.
  •  వేడి పదార్దాలు, ఆల్కహాల్, కూల్డ్రింక్స్, స్నాక్స్, పిజ్జా, బర్గర్, ఆలు చిప్స్, చికెన్, మటన్ ఫిష్ తినరాదు.,tea, కాఫీ తాగరాదు.బీడీలు,సిగరెట్స్    స్మోకింగ్ చేయరాదు. బజారులో దొరికే మిర్చి బజ్జిలు, బొండాలు, సమోసాలు, గుప్ చుప్, చెత్త చదారం food తినరాదు.
  •  యోగలో బాలసనం, బ్రీతింగ్ excercises చేయాలి. ఎక్కువ సేపు నిలబడరాదు.
  •  పైల్స్ కి సంబందించిన ఆయుర్వేద మందులు, ఇతర వివరాలకు  సంప్రదించండి

-షేక్. బహార్ అలీ

ఆయుర్వేద వైద్యుడు
ఖమ్మం.7395126557.

Leave A Reply

Your email address will not be published.