ప్రేమెప్పుడూ!

ప్రేమెప్పుడూ
అపార్ధాలకు నెలవు కాకూడదు,
అర్ధం చేసుకొనే-
మనసు కలిగుండాలి!
ప్రేమెప్పుడూ
నాకోసం నువ్వే తగ్గాలి అనేట్లు ఉండకూడదు,
నీకూ,నాకూ మధ్య –
ఏ అడ్డూ రాకూడదనేలా ఉండాలి!
ప్రేమెప్పుడూ
నాకోసం నువ్వు పరితపించిపోవాలి అనుకోకూడదు,
మన ప్రేమ నలుగురికి –
ఆదర్శంగా నిలవాలి అనుకోవాలి!
ప్రేమెప్పుడూ
నేనే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను అన్నట్లుండకూడదు,
నీకోసం నేను, నాకోసం నువ్వు
ప్రతీక్షణం నమ్మకంతో నిరీక్షించేంత సహనం కలిగుండాలి!
ప్రేమెప్పుడూ
నేను నీకు పంచే ప్రేమే గొప్ప అన్నట్లుండకూడదు
ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా
మనమొక్కటై నిలవాలి అనేంత దృఢమైనదై ఉండాలి!
అదే నిజమైన ప్రేమ
అలా లేకుంటే
అది ప్రేమనుకొనే భ్రమే!
-ఎన్.రాజ్యలక్షి