Delhi: తెలంగాణ కులగణన పై ప్రజెంటేషన్..
ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ కులగణన సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపిలు, నేతలకు కులగణన సర్వేపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని.. తెలంగాణలో తమ సర్కార్ మాత్రమే కులగణన నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్దిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగిందన్నారు. ఇది 88 కోట్ల పేజీల్లో నిక్షిస్తమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేవవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టి అధినేత రాహుల్ గాంధీ ప్రకటిచారన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగానలో కులగణన సర్వే చేపట్టామన్నారు.
రాష్ట్ర డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరలు పాల్గొన్నారు.