మహాత్మాగాంధీకి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గల మహాత్ముడి సమాధి వద్ద రాష్ట్రపతి, ప్రధాని అంజలి ఘటించారు.

వీరితో పాటు పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సిఎం అతిశీ తదితరులు నివాళులర్పించారు.