18వ లోక్‌సభలో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్‌లో 18వ లోక్‌సభ కొత్తగా కొలువుదీరింది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం ప్రసంగించారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎన్నికల ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించిన ఇసికి అభినందనలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్‌సభకు వచ్చిన వారు ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు.. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ముందుగా పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్, జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు.