తిరుమల శ్రీవారి సన్నిధానంలో రాష్ట్రపతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/TIRUPATHI.jpg)
తిరుమల ( CLIC2NEWS): తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. సోమవారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇఓ ధర్మారెడ్డి, రాష్ట్రపతతికి స్వాగతం పలికారు. స్వామివారి చిత్ర పటం, తీర్థప్రసాదాలు రాష్ట్రపతికి అందజేసి వేదాశీర్వచనం పలికారు. ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నారాయణ స్వామి, ఆర్ కె రోజా, కొట్టు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.