హైదరాబాద్‌లోని సమతామూర్తిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/DRAUPADI-MURMU-1.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతిభవన్‌కు వచ్చిన విషయం తెలిసిదే. రాష్ట్రంలోని పలు ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తున్న ఆమె నేడు నగర శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తిని సందర్శించారు. చినజీయర్‌స్వామి సహా అర్చకులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. స్పూర్తి కేంద్రంలో శ్రీరామానుజాచార్యుల చారిత్రక విశేషాలు గురించి రాష్ట్రపతికి చినజీయర్‌స్వామి స్వయంగా వివరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతిరాథోడ్ ఉన్నారు.