తెలుగు కవులను, మహనీయులను కీర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. పోరంకిలో రాష్ట్రపతికి పౌరసన్మానం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తిరుమల బాలాజి స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలుగులో మాట్లాడారు. కనకదుర్గ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్సట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవులు, మహనీయులను, ఆధ్యాత్మిక కేంద్రాలను కొనియాడారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ పరిచయమేనని.. దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి చేరుకున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ బిశ్వభూషణ్ అధికార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సిఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సిజె జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.