శిల్పారామంలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
హైదరాబాద్ (CLiC2NEWS): భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగమని.. ఇది ఇంధ్రధనస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నగరంలోని శిల్పారామంలో శుక్రవారం లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సి ఉందన్నారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశాగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. 2018లో రాంచీలో నిర్వహించిన లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందని, ఇది గొప్ప ప్రయత్నమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్‌స్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.