రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

హైదరాబాద్ (CLiC2NEWS): ముచ్చింతల్‌లోని సమతామూర్తి సహస్రాబ్ధి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రపతి దంపతులు ఇవాళ (ఆదివారం) సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామానుజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో తయారుచేసిన స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకానికి అంకితం చేశారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై , మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్,కార్యక్రమంలో పాల్గొన్నారు