జ‌ర్మ‌నీ చేరుకున్న ప్ర‌ధాని మోడీ

బెర్లిన్ (CLiC2NEWS): యూర‌ప్‌లోని మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ జ‌ర్మ‌నీ చేరుకున్నారు. ఇవాళ (సోమ‌వారం) ఉద‌యం మోడీ బెర్లిన్‌.. బ్రాండెన్‌బ‌ర్గ్ విమానాశ్ర‌యంలో అడుగుపెట్టారు. యూర‌ప్ దేశాల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ముందుగా జ‌ర్మ‌నీ చేరుకున్నారు. జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ప్ర‌ధాని భేటీ అవతారు. ఆపై 6వ ఐజీసీ (ఇండియా జ‌ర్మ‌నీ ఇంట‌ర్ గ‌వ‌ర్న‌మెంటల్ క‌న్స‌ల్టేష‌న్స్‌)లో పాల్గొంటారు.

అనంత‌రం మోడీ మంగ‌ళ‌వారం డెన్మార్క్‌, బుధ‌వారం ఫ్రాన్స్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.