ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/Modi-hoisted-the-national-flag-at-Red-Fort.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి మోడీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులకు ఆయన స్వాతంత్య్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించి.. అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు.
ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద సామ్రజ్యమని, బాపూజి అహింసా మార్గంతో స్వాతంత్య్రం సాధించామని మోడీ గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాణి దుర్గావతి, మీరా బాయిని స్మరించుకోవాల్సిన తరునమిదన్నారు. ఇటీవల మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని యోడీ అన్నారు. జి20 సమావేశాలు మన దేశ సామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాయన్నారు. కరోనా అనంతరం భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు. మన ఎగుమతులు కొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయని, కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదన్నారు.