వందే భార‌త్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశంలో ఆరో వందే భార‌త్ రైలు మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బిలాస్‌పూర్ మ‌ధ్య ప్రారంభ‌మైంది. ఈ రైలును ప్ర‌ధాని మోడీ ఆదివారం నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ధాని రైలులో ప్రాయాణించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రాయాణికులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు.

నాగ్‌పూర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. రూ.8650 కోట్ల‌తో మెట్రోఫేస్‌-1 ను మోడీ ప్రారంభించారు. సాధార‌ణ ప్ర‌యాణికుడిలా ప్ర‌ధాని మోడీ టికెట్ కొనుగోలు చేసి కొంత దూరం మెట్రోలో ప్ర‌యాణం చేశారు. అనంత‌రం మెట్రో ఫేస్‌-2కు శంకుస్థాప‌న చేశారు.

Leave A Reply

Your email address will not be published.