ప్రజాసేవ చేయకుంటే ప్రశాంతంగా నిద్రపోలేను: ప్రధాని మోడీ
పట్నా (CLiC2NEWS) : ప్రజాసేవ చేయకుంటే తాను ప్రశాంతంగా నిద్రపోలేనని.. రాత్రి-పగలు ప్రజల కోసమే పనిచేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధని మోడీ రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్రంలోని సివాన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశాగా సాగుతుందన్నారు. దీనికి మర్హౌరా రైలు ఫ్యాక్టరీ ఓ ఉదాహరణన్నారు. కాంగ్రెస్, ఆర్‌జెడి పట్టించుకోని సరన్ జిల్లాలోనే ఈ రైల్వే ప్రాజెక్టు కొనసాగుతోందని.. తయారీ , ఎగుమతుల్లో జంగిల్ రాజ్ అడ్డుకుందిన్నారు. కానీ, ఇపుడు బిహార్లో తయారైన ఇంజిన్ ఆఫ్రికన్ రైలుకు శక్తినిస్తుందని మోడీ తెలిపారు.
దేశంలో పేదరికానికి కాంగ్రెస్ లైసెన్స్ రాజ్ కారణమని .. బిమార్‌ను లైసెన్స్ రాజ్ సుదీర్ఘ కాలంఆ పేదరికంలోనే ఉంచిందని మోడీ విమర్శలు చేశారు. నేతల కుటుంబీకులు ధనవంతులు కాగా.. సామాన్యులు మాత్రం పేదలుగానే ఉండిపోయారన్నారు. రానున్న రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని మోడీ తెలిపారు.