ఈ నెల 8న ఎపిలో ప్రధాని పర్యటన
అమరావతి (CLiC2NEWS): జనవరి 8వ తేదీన ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్నారు. ఎపి పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సిరిపురం కూడలి నుండి ఎయు ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ వెళ్లనున్నట్లు సమాచారం.