విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి
విశాఖపట్నం (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖలో రోడ్ షోలో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. విశాఖ మారుతి జంక్షన్ నుండి 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. భారీ బందోబస్తుతో రోడ్ షో జరిగింది.
