నేడు ఎపికి ప్రధాని నరేంద్ర మోడీ రాక..
రూ.2లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విశాఖ (CLiC2NEWS): నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎపిలో మోడీ పర్యటనకు అన్ని రకాల ఏర్పాటల్లు చేశారు. సిఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మోడీ పర్యటనలో భాగంగా రూ. 2.08 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటన్నికి కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.