గోవా లిబరేషన్‌డే వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

గోవా (CLiC2NEWS): గోవా లిబరేషన్‌డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి పాల్గొన్నారు. అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులర్పించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్వాతంత్ర్య సమర యోధులు, ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న సైనికులను సత్కరించారు. పోర్చుగీసు పాలన నుండి గోవాకు విముక్తి కలిగించిన భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయ్‌కు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19వ తేదీన గోవా లిబరేషన్ డే వేడుకలు జరుపుతారు. ఈసందర్భంగా సాయుధ దళాల స్మారక చిహ్నంగా ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మైస్టాంప్‌ను విడుదలచేశారు. ఉత్తమ పంచాయితీ, మున్సిపాలిటి, స్వయంపూర్ణమిత్ర, స్వయంపూర్ణగోవా కార్యక్రమాలకు సంబంధించిన అబ్దిదారులకు ప్రధానమంత్రి అవార్డులు అందించారు.