హిమప్రియకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కార్ ఆవార్డు
హైదరాబాద్ (CLiC2NEWS): హిమప్రియకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) ఆవార్డు లభించింది. సోమవారం ప్రధానమంత్రి వర్చవల్ విధానంలో పిఎమ్ ఆర్బిపి అవార్డును అందజేశారు. హిమప్రియ సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని పొన్నం గ్రామం. తండ్రి సత్యనారాయణ ఆర్మీ జవాన్. వీరి కుటుంబం జమ్మూ లోని ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది. 2018 ఫిబ్రవరి 10 వతేదీన ఉదయం 5 గంటల సమయంలో ఆర్మీ క్వార్టర్స్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో హిమప్రియ తండ్రి ఇంట్లో లేరు. ఆసమయంలో హియప్రియకు దెబ్బలు తగిలినా బెదరక స్థానికులను ప్రాణాలను రక్షించింది. ఈమె ధైర్యసాహసాల్ని కేంద్ర రక్షణ శాఖ అభినందించింది.