ఎంపిగా ప్రియాంక గాంధీ ప్రమాణం..
ఢిల్లీ (CLiC2NEWS): వయనాడ్ నుండి ఎంపిగా గెలుపొందిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ప్రార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆమె గురువారం ఎంపిగా ప్రమాణం చేశారు. ఇటీవల వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక గాంధీ ప్రమాణానికి అమె సోదరుడు రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఆమెకు అభినందనలు తెలియజేశారు. పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికలలో పోటీ చేశారు. కేరళలోని వయనాడ్ నుండి ఆమె లోక్‌సభ స్థానానికి పోటీ చేయగా.. భారీ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఆమె సోదరుడు రాహుల్‌గాంధీ.. వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకోవడంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.