వయనాడ్‌లో ప్రియాంక గాంధీ విజయభేరీ..
వయనాడ్ (CLiC2NEWS): తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 3.94లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొంది , వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ , రాయబరేలీ రెండుచోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన ప్రత్యర్థి సిసిఐ నాయకురాలు అన్నీరాజాపై 3.64లక్షల మెజార్టితో గెలుపొందారు. అదేవిధంగా రాయ్‌బరీలీలో కూడా విజయం సొంతం చేసుకున్నారు. దీంతో వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్‌లో 4.3లక్షల మెజార్టీని సాధించారు.