తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా నిర్మాత‌ దిల్‌రాజు

హైద‌రాబ‌ద్ (CLiC2NEWS): తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా నిర్మాత‌ దిల్‌రాజు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. దిల్ రాజు అస‌లు పేరు వెంక‌ట‌రామిరెడ్డి. 2003లో నితిన్ హీరో గా తెర‌కెక్కిన దిల్ చిత్రానికి తొలిసారి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో అప్ప‌టి నుండి ఆయ‌న పేరు దిల్ రాజుగా మారింది. ఆయ‌న పెళ్లి పందిరి సినిమాలో పంపిణీదారుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.