తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొ. బాలకిష్టారెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణరాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ప్రొ. లింబాద్రి స్థానంలో నల్సార్ వర్సిటి రిజిస్ట్రార్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, ప్రస్తుతం మహీంద్ర వర్సిటీ లా స్కూల్ డీన్ గా ఉన్న బాలకిష్టారెడ్డిని సర్కార్ నియమించింది. విద్యామండలి వైస్ చైర్మన్‌గా ప్రొ. ఇటిక్యాల పురుషోత్తంను నియమించారు.
ముఖ్యమంత్రి రేవంత్ ఆమోదంతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.