సి-మెట్‌లో ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులు

CMET: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజి(సి-మెట్) తాత్కాలిక ప్రాతిపదికన 4 ప్రాజెక్ట్ ఫెలో, 3 ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌సి , ఎస్‌టిలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులను ధ్రవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 16. వేదిక సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజి (సి-మెట్), ఐడిఎ ఫేజ్-3, చర్లపల్లి, హెచ్‌సిఎల్, హైదరాబాద్.
ప్రాజెక్టు ఫెలో పోస్టులకు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్ (మెటర్జి / కెమికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎన్విరాన్‌మెంటల్), ఎమ్మెస్‌సి ( ఫిజిక్స్ / కెమిస్ట్రి/ మెటీరియల్స్ సైన్స్), ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థుకు నెలకు రూ. 40,300 వేతనం అందుతుంది.
ప్రాజెక్టు అసిస్టెంట్‌లకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా (మెటలర్జి/ కెమికల్ / మెకానికల్), బిఎస్‌సి (ఫిజిక్స్/ కెమిస్ట్రి) తో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,300 వేతనం అందుతుంది. పూర్తి వివరాలకు https:// cmet.gov.in/jobs వెబ్ సైటం చూడగలరు.